Take a fresh look at your lifestyle.

నేడు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ…..

0

నేడు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ

ఎడపల్లి , డిసెంబర్ 25 ( లోకంతీరు ) : హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలి ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మతం హిందూ మతం హిందువులు ప్రపంచ దేశాలలో మొత్తం విస్తరించి ఉన్నారు కానీ ఎక్కడో ఒకచోట ఏదో ఒక విషయంలో హిందువుల మీద హిందూ దేవుళ్ళ మీద అనాదిగా  విషం కక్కుతూనే ఉన్నారు పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందూ మరణ కాండను మనం చూడడం జరిగింది ఇప్పటికైనా హిందుత్వాన్ని హిందూ సమాజాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది మనమందరం ఏకమై మన మీద హిందువుల మీద హిందుత్వం మీద హిందూ దేవుళ్లంపైన దాడి చేసే వారిని తీవ్రంగా శిక్షించాలని అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మరణ హత్యకాండను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ. నిర్వహించడం జరుగుతుంది కావున హిందూ బంధువులందరూ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు పెద్ద హనుమాన్ మందిర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కాగడాల ర్యాలీ నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది కావున హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.