Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు….

0

ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

ఎడపల్లి, సెప్టెంబర్ 24 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఆస్పత్రి) ఆధ్వర్యంలో బుధవారం మహిళా సిబ్బంది (ఉద్యోగులు), బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతకుముందుగా మహిళలు బతుకమ్మలను ఆసుపత్రి ఆవరణంలో ఉన్న మైసమ్మ గుడి వద్ద. బతుకమ్మలను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మైసమ్మకు తమమొక్కలను తీర్చుకున్నారు. అనంతరం మహిళలు బతుకమ్మలను తలపై పెట్టుకుని ఆడుతూ పాడుతూ ఆసుపత్రి ఆవరణములో ఒకచోట పేర్చారు.అక్కడ గౌరమ్మకు ప్రత్యేకoగా పూజలు చేసిన అనంతరం మహిళ ఉద్యోగులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటు ఆడుతూ పాడారు.ఈ సందర్భంగా ఎంపీహెచ్ఏ సిబ్బంది మల్లెపూల గంగామణి మాట్లాడారు. బతుకమ్మ అంటే గౌరమ్మ, గౌరమ్మంటే బతుకమ్మ, అనే సామెత ఉందని బతుకమ్మ అంటే మహిళలకు ఎంతో ఇష్టమైన పండగ, బతుకమ్మ పండుగ రోజున చిన్నారి బాలికలు ,మహిళలు ,వృద్ధులు రంగురంగుల పూల బతుకమ్మలను తమ వాకిట్లో పేర్చి ఆడుతూ పాడుతూ తమ ఆనందాన్ని పంచుకుంటారు.ఏది ఏమైనా అప్పటికి బుధవారం ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలను ఆస్పత్రి మహిళలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు.అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. వైద్యాధికారులు వినీత్ కుమార్ రెడ్డి, వెంకటేష్, ల్యాబ్ టెక్నీషియన్స్ కృష్ణమోహన్,ఆస్పత్రి మహిళా ఏఎన్ఎంలు, ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.