ఎడపల్లి మండలంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
ఎడపల్లి, అక్టోబర్ 12 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలు భాజా భజంత్రీల మధ్య బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి భక్తులు గ్రామ దేవతలకు నైవేద్యం ఒడి బియ్యం గాజులు సమర్పించారు గ్రామంలోని పిల్లా పాపలు పాడి పంటలు చల్లగా ఉండాలని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు