Take a fresh look at your lifestyle.

ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి…..

0

ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ఎడపల్లి, అక్టోబర్ 26 ( లోకంతీరు ) :  నిజామా బాద్ జిల్లా ఎడపల్లిమండలంలో ఇటీవల కురుస్తున్న వర్షానికి రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై అలాగే పంట పొలాo లో ఆరబెట్టుకున్నారు. గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రైతులు ఎండబెట్టిన ధాన్యం తడిసిపోవడమే కాకుండా ఆరబెట్టడానికి స్థలాలు లేని రైతులు పంట పొలాo లో ఆరబెట్టడంతో నాన్న తంటాలు పడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో సుమారు రెండు గంటల పాటు మండలంలో వర్షం పడడం వల్ల అనేక మంది రైతులు తీవ్ర ఆవేదన గురై నానా ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యాన్ని పంట మడికట్ల నుండి రోడ్డుపైకి తీసుకు వెళ్ళడానికి అనేక ఖర్చులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పకృతి వైపరీత్యాల వల్ల అటు జిల్లా స్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఇటు మండల, డివిజన్స్ స్థాయి సంబంధిత శాఖ అధికారులు రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంగా చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రకృతి వైపరీతల వల్ల కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారని అధికారులు సైతం తీవ్ర బాధపడుతున్నారు. ఆదివారం ఎడపల్లి మండలం తో పాటు చుట్టుపక్కల పల్లె ప్రాంతాలలో వర్షం జోరుగా కురవడంతో రైతన్నలు మహిళ రైతులు నాన్న తంటలు పడి పంట పొలాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని తిరిగి రోడ్డుపైకి తీసుకురావడానికి అనేక కష్టాలు పడ్డారు. నేడు, రేపు కూడా ఉమ్మడి జిల్లాలో భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణం శాఖ అధికారులు స్పష్టంగా తెలిపినట్లు శాఖ అధికారులు తెలిపారు. రైతన్నలు పండించిన వరి ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవాల్సి ఉందన్నారు . చాలామంది చిన్న స్వర్ణక రైతులకు ధాన్యాన్ని ఆరబెట్టడానికి స్థలాలు లేకపోవడంతో పంట పొలాo లో ఆరబెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత సహకార సంఘాల కొనుగోలుతో పాటు ఐకెపి కొనుగోలు నిర్వాహకులు రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తో పాటు సంబంధిత ఎడపల్లి మండల స్థాయి అధికారులను వేడుకుంటున్నారు. లేదంటే తాము పండించిన ఆరు నెలల పంట నీటి పాలు కావడం పట్ల తాము కన్నీరు మున్నీరవుతున్నామని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలనిఎడపల్లి మండలరైతులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.