Take a fresh look at your lifestyle.

ఫిలిప్పీన్స్ దేశ మైగ్రేషన్ పాలసీ స్టడీ టూర్ లో తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వయిజరీ కమిటీ బృందం……

0

ఫిలిప్పీన్స్ దేశ మైగ్రేషన్ పాలసీ స్టడీ టూర్ లో

తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వయిజరీ కమిటీ బృందం

– పర్యటనలో ప్రభుత్వ విప్   ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే  డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి

– గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం నివేదిక రూపకల్పనకు కృషి  

– ప్రపంచంలో ఫిలిప్పిన్స్ దేశంలోనే ఉత్తమ మైగ్రేషన్  విధానం ఉంది

– ఫిలిప్పీన్స్ మైగ్రేషన్ తీరులోనే తెలంగాణ రాష్ట్ర వలస  విధానంపై ప్రణాళికలు రచిస్తాం 

– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి వెల్లడి 

నిజామాబాద్ రూరల్  , ఆగష్టు 18 ( లోకంతీరు న్యూస్ ) : ప్రపంచంలోనే ఉత్తమ మైగ్రేషన్ పాలసీ (వలస విధానం) అమలులో ఉన్న ఫిలిప్పీన్స్ దేశంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ బృందం మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశ రాజధాని మనీలాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొంది.తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనున్న కార్యాచరణ ప్రణాళికను రచించేందుకు రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఫిలిప్పిన్ దేశ పర్యటన అనుభవాలతో తయారు చేసే నివేదిక ఎంతో ఉపయోగపడనుంది.ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలా నగరంలోని ఇబీస్ స్టయిల్స్ అరెనేట కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్,నిజామాబాద్ రూరల్  ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గల్ఫ్ లో నివాసముంటున్న కార్మికుల కోసం సంక్షేమం కోసం ఉత్తమమైన సంక్షేమ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు, అందులో భాగంగానే ఫిలిప్పీన్స్ దేశ పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం ఉత్తమమైన గల్ఫ్ సంక్షేమ పాలసీని రూపొందించడం కోసం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పన, ‘గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ పర్యటన చేపట్టినట్లు వారు తెలిపారు.ఈ కాన్ఫరెన్స్లో ఫిలిప్పీన్స్ లేబర్ మైగ్రేషన్ అండ్ సివిల్ సొసైటీస్ ఆర్గనైజేషన్ రెస్పాన్స్, ఫిలిప్పీన్స్ లేబర్ మైగ్రేషన్ గవర్నెన్స్, బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్, గ్లోబల్ మైగ్రేషన్ యాక్షన్ ప్లాన్,  లేబర్ మైగ్రేషన్ కారిడార్ ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్సెస్ అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.