బోధన్ లో అంబరాన్నంటిన బిజెపి సంబరాలు

ఎడపల్లి, నవంబర్ 14 ( లోకంతీరు ) : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 244 స్థానాలకు జరిగిన పోలింగ్ లో ఎన్డీఏ కూటమి 200 సీట్లకు పై చిలుకు మెజార్టీ సాధించడంతో దేశం వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులో హర్షతిరేకలు వ్యక్తమవుతున్నాయి ఈ విజయాన్ని పురస్కరించుకొని బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ నేతృత్వంలో కార్యకర్తలు టపాసులు కాల్చి పరస్పరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గోపి కిషన్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశ భద్రతపై తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని అన్నారు బీహార్ ప్రజలు ఓటు రూపంలో ప్రకటించిన తీర్పు మోడీ నాయకత్వానికి ఇచ్చిన మద్దతు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ కోశాధికారి వేణు కార్యదర్శి సఫిల్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఏనుగంటి గౌతమ్ గౌడ్ అనిల్ ప్రీతం గౌడ్ బిల్లా విజయ్ సాగర్ శ్రీకాంత్ రాజు పడాల శ్రీనివాస్ కుమార్ లోకేష్ ధర్మేందర్ సింగ్ పంజాబ్ సింగ్ పవన్ కళ్యాణ్ భాస్కర్ నవీన్ ఫన్నీ శంకర్ భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.