ఎడపల్లి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మృతి

ఎడపల్లి , నవంబర్ 20 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ అధ్యక్షులు పండరినాథ్ బాబా గురువారం ఉదయం మృతి చెందారు. సహకార సంఘం అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో ఆయన రైతుల అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారు, సహకార సంఘ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. అలాగే గ్రామ అభివృద్ధికి కూడా తన వంతు సేవలను అందించారు. ఆయన మృతి బాధాకర విషయమని బంధువులు స్థానిక ఎడపల్లి గ్రామ రైతులు, గ్రామ ప్రజలు యువకులుతాజా ప్రతినిధులు విచారణ వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఆయన కుటుంబ సభ్యులు బంధువులు, మిత్రులు, గ్రామస్తులు, ఎడపల్లి సహకార సంఘం పాలకవర్గం, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం నిర్వహించిన అంత్యక్రియల్లో మండలంలోని ఆయా గ్రామాల బంధువులు నాయకులు మిత్రులు స్థానిక గ్రామ పెద్దలు రైతులు తదితరులు పాల్గొన్నారు.