శ్రీ చక్రేశ్వర శివ మందిరం లో హుండీలు లెక్కింపు

ఎడపల్లి, నవంబర్ 22 ( లోకంతీరు ) : బోధన్ పట్టణంలోని దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశానుసారం శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో నవంబర్ 26 న ఉదయం 10 గంటలకు దేవస్థానం అధికారులు హుండీ లెక్కించనున్నారు ఆలయ హుండీల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు దేవదాయ శాఖ అధికారులు ప్రత్యక్షంగా హాజరుకానున్నట్లు ఆలయ ఈవో రాములు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు ప్రతిసారి నిర్వహించే హుండీ లెక్కింపు కార్యక్రమం ద్వారా ఆలయం ఆదాయాన్ని నమోదు చేసి భక్తులకు పూర్తి వివరాలు అందించే విధానం అమలులో ఉన్నట్లు ఆయన తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై దేవస్థాన కార్యక్రమానికి సాక్షులుగా ఉంటూ సహకరించాలని ఆలయ వర్గాలు కోరుతున్నాయి.