నేడు ఎడపల్లి మండలంలో సుదర్శన్ రెడ్డి రోడ్ షో

ఎడపల్లి, నవంబర్ 13( లోకంతీరు ) : ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారంఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు తెలియచేయునది ఏమనగా ప్రియతమ నాయకులు బోధన్ శాసన సభ్యులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు గా నియమించిన తర్వాత మొదటిసారి మన నియోజకవర్గానికి విచేస్తున్న సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 01 గంటలకు నిజామాబాద్ లో ప్రారంభమై నెహ్రు నగర్,జానకంపెట్,సాటపూర్ గేట్, ఎడపల్లి మీదుగా రోడ్డు మీద ఉన్న గ్రామాల గుండా నియోజకవర్గం లో పర్యటిస్తారు. కావున మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు సార్ ని వచ్చి కలిసి శుభాకాంక్షలు తెలిపే వారు మీకు అందుబాటులో ఉన్న గ్రామంలో వారువచ్చి పాల్గొనగలరనీ ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు తెలిపారు.