Take a fresh look at your lifestyle.

హత్య కేసులో సంచలన తీర్పు…..

0

హత్య కేసులో సంచలన తీర్పు

  • నిందితునికి ఉరిశిక్ష విధించిన జిల్లా న్యాయస్థానం

  • అభినందించిన పోలీసు కమీషనర్

నిజామాబాద్ క్రైమ్ , జనవరి 05( లోకంతీరు ) : ఓ హత్య కేసులో నిందితుడకి జిల్లా కోర్టు సంచలన తీర్పు విధించింది.నిందితుడికి ఊరి శిక్ష ఖరారు చేసింది.వివరాల్లోకి వెళితే ఫిర్యాదిదారురాలు కండేల లత @ సిందే లత, వయస్సు 25 సం., బ్రాహ్మణ కాలనీ, నిజామాబాద్, వారు గత సంవత్సరం ఫిబ్రవరి 16 న సా. 6 గంటలకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె భర్త కండేల సందీప్, వయస్సు 28 సం., ఆటో నెం. TS16UD2298 నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.ఫిబ్రవరి 15 ఉదయం 6:30 గంటలకు ఆటో నడపడానికి వెళ్లిన సందీప్ తిరిగి రాకపోవడంతో, కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోవడంతో 5 వ టౌన్ పోలీస్ స్టేషన్ యందు ఫిర్యాదు చేశారు.దర్యాప్తులో నిందితుడు మద్యం, తాటి కల్లు అలవాట్లకు లోనై, లాభం కోసం నేరాలకు పాల్పడినవాడని తేలింది. ఆటో మరియు సెల్ ఫోన్ కోసం ఫిబ్రవరి 15 న మృతుడిని మత్తులోకి తీసుకెళ్లి , చంద్రాయణపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతం (ఎన్ హెచ్-44) వద్ద తోసి పడగొట్టి , రాయితో ఛాతిపై కొట్టి హత్య చేసి , ఆధారాలు నశింపజేయడానికి మృతదేహాన్ని కాల్చి , ఆటో మరియు సెల్ ఫోన్‌ను అపహరించి పారిపోయాడు.అనంతరం పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకొని విచారించగా నేరాన్ని స్వచ్ఛందంగా ఒప్పుకొని , సంఘటన స్థలం , ఉపయోగించిన రాయి , దొంగతనానికి గురైన ఆటో మరియు సెల్ ఫోన్‌ను చూపించాడు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడు–మృతుడు కలిసి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుడిని అరెస్ట్ చేసి జిల్లా న్యాయస్థానంలో హాజరు పరచారు.ఇట్టి కేసులో సోమవారం నిజామాబాద్‌లోని న్యాయస్థానం ప్రత్యేక సెషన్స్ జడ్జి–కమ్–IIIవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి న్యాయమూర్తి డి. దుర్గా ప్రసాద్ టౌన్–V పోలీస్ స్టేషన్ పరిధిలో బి ఎస్ ఎన్ సెక్షన్లు 238, 307, 103 కింద నమోదు చేసిన కేసును బహిరంగ న్యాయస్థానంలో విచారించి తీర్పును వెలువరించారు.

సెక్షన్ 238 బి ఎస్ ఎన్ కింద నిందితుడిని దోషిగా తేల్చి,
7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.10,000/- జరిమానా విధించారు.

సెక్షన్ 307 బి ఎస్ ఎన్ కింద
5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.5,000/- జరిమానా విధించారు.

సెక్షన్ 103 బి ఎస్ ఎన్ కింద
మరణ శిక్ష మరియు రూ.10,000/- జరిమానా విధించారు.

ఇట్టి కేసులో ధర్యాప్తు చేసిన నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ బి. శ్రీనివాస్, ఇట్టి కేసును కోర్టు లో వాదించిన పబ్లిక్ ప్రాసీక్యూటర్ రాజ్ రెడ్డి , ఇట్టి కేసులో నిందితునికి శిక్ష పడేవిధంగా కృషి చేసిన టౌన్ 5 పి.ఎస్ ఎస్.ఐ ఎం.గంగాధర్ , కోర్టు లైజన్ ఆఫీసర్ ఎస్. ఐ శ్యామ్ కుమార్ , కోర్టు పోలీస్ కానిస్టేబుల్ 1898 పి.సాయన్న , పిసి 707 ఎం. శ్రీనివాస్ , పిసి 63 రాజు పిసి 2390 జి. సచిన్ , పీసి 2148 ఎ. దత్తాత్రేగౌడ్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.