సర్పంచ్ గా గెలిపించండి గ్రామ రూపు రేఖలు మారుస్తా

ఎడపల్లి , డిసెంబర్ 06 ( లోకంతీరు ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగల్ పాడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు తనను గ్రామస్తులు ఆదరించి రింగ్ (ఉంగరం)గుర్తుకు ఓటు వేసిసర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని అరుగుల వనజ నాగరాజ్ ఓటర్లను కోరారు. శనివారం గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఓటర్లతో అన్నారు. కార్యక్రమంలో అరుగుల నాగరాజు, బండ లింగారెడ్డి, దెగులూరు సుమన్, బండ అభిలాష్, బుడ్డ అబ్బయ్య, ఎర్రోళ్ల సాయమ్మ, నాయకులు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.