నిజామాబాద్ జిల్లాలో చలిగాలులు
ఎడపల్లి, డిసెంబర్ 16 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా నగరం తో పాటు జిల్లాలోని అన్ని మండలాలలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది గత రెండు రోజులుగా వీస్తున్న చలిగాలుల కారణంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు ఉదయం 9 గంటల వరకు సైతం చలి అధికంగా ఉండడంతో చిన్నపిల్లలు వృద్ధులు అస్తమ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ చలి ప్రభావం మరికొన్ని రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు కావున చిన్నపిల్లలను వయోవృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు ఉదయం 10 గంటల వరకు పిల్లలకు వృద్ధులకు బయటకు తీసుకురావద్దని వారు తెలిపారు కూల్ వాటర్ తాగకుండా గోరువెచ్చని నీరు తాగిపించాలని తెలిపారు.