క్రమశిక్షణతోనే విద్యార్థులకు బంగారుభవిష్యత్తు
ఎడపల్లి , డిసెంబర్16 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలురవ సతి గృహంలో సీటు పొందిన విద్యార్థులు సమీపంలో ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు ఎడపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో సీట్ పొందడం అదృష్టంగా భావించవచ్చు. మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఈ వసతి గృహంలో సీటు పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు తగ్గట్టుగా వసతి గృహం వార్డెన్ తో పాటు నైట్ వాచ్మెన్, సిబ్బంది విధులు నిర్వహిస్తూ విద్యార్థులను క్రమశిక్షణలో నిలుపుతున్నారు. రోజువారీగా మేను ప్రకారం భోజనాలు చేసిన అనంతరం బాలురు తాము చదువుకుంటున్న పాఠశాలలకు క్యూ పద్ధతిలో క్రమశిక్షణగా వెళుతూ వస్తున్నారు. వీరికి తోడుగా పాఠశాలకు చేరేవరకు నైట్ వాచ్మెన్ సాయిలు వెంట ఉంటున్నారు. తిరిగి సాయంకాలం పాఠశాల వదిలిన తర్వాత విద్యార్థులను మళ్ళీ వసతి గృహం వరకు తీసుకొచ్చేందుకు క్యూ పద్ధతిలోని విద్యార్థులు వస్తున్నారు. సాయంకాలం వసతి గృహంలో అల్పాహారం అనంతరం రాత్రిపూట నాణ్యమైన భోజనం ఉంటుంది. విద్యార్థులకు కావలసిన మౌలిక సౌకర్యాలు అన్ని వసతి గృహంలోనే ఉన్నాయి. సౌకర్యాలతో పాటు చదువును కూడా మరింత మెరుగుపరిచేందుకు వసతి గృహం వార్డెన్ నర్సింలు ప్రత్యేక చొరవ తీసుకుని విధులను క్రమంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పట్ల ఎప్పటికప్పుడు ప్రత్యేక చొరవ చెబుతున్నారు. సుదూర ప్రాంతాల నుండి వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించేందుకు కూడా ప్రత్యేక చొరవ చూపుతున్నారు.ఈ వసతి గృహంలో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు పట్ల వార్డెన్ నర్సింలు, వాచ్మెన్ సాయిలు, సిబ్బంది తమ ఇంటి పిల్లల్లాగా చూసుకుంటున్నారు. ఏది ఏది ఏమైనాప్పటికీ సుదూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థుల పట్ల ప్రత్యేకగా చొరవ చూపడం జరుగుతుంది. క్రమశిక్షణతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన డానికి నిదర్శనం ఈ విద్యార్థులే అని చెప్పుకోవచ్చు.