Take a fresh look at your lifestyle.

ఎడపల్లి గురుకుల పాఠశాల వద్ద బస్సులు ఆపాలి….

0

ఎడపల్లి గురుకుల పాఠశాల వద్ద బస్సులు ఆపాలి

  • మహిళా ఉపాధ్యాయుల విన్నపం 

ఎడపల్లి , జనవరి 08  ( లోకంతీరు ) :  మండలం పరిధిలోని పెద్ద వాగు దాటిన తర్వాత నిజాంబాద్ – బోధన్ ప్రధాన రహదారి పక్కన ఉన్న తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల కళాశాల, అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తారు. కొందరు మహిళ ఉపాధ్యాయులు నిజామాబాదు నుండి మరికొందరు మహిళ ఉపాధ్యాయులు బోధన్ నుండి పాఠశాలలకు చేరుకుంటారు. బోధ న్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు పాఠశాల వద్ద పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆపడం లేదని మహిళా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో లిఖితపూర్వకంగా ఉపాధ్యాయులందరము ఆర్టీసీ బస్సులు ఆపాలని బోధన్ డిపో మేనేజర్ గారికి విన్నవించినట్లు మహిళ ఉపాధ్యాయులు తెలిపారు. లోకల్ బస్సులే కాకుండా, టూ స్టాప్, ఎక్స్ప్రెస్, నిజామాబాద్ నుండి నాందేడ్ వెళ్లే బోధన్ డిపో బస్సులను తప్పకుండా ఆపాలని ఉపాధ్యాయులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. ఉదయం పూట పాఠశాలకు కళాశాలలకు సమయ పాలన పాటించాల్సిన అవసరం ఉంది. అందుకే తాము బోధన్ నుండి ఇటుగా నిజామాబాద్ నుండి ఆర్టీసీ బస్సులో వస్తున్నందున ప్రతి ఒక్క బస్సు అక్కడ ఆగే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని మహిళా ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ బస్సులు ఆపకపోవడం వలన ఎడపల్లి పాత బస్టాండ్లో దిగి మళ్ళీ అక్కడినుండి పాఠశాల వరకు ఆటోలో వస్తున్నట్లు మహిళ ఉపాధ్యాయులు తెలిపారు. ఇప్పటికైనా బోధన్ ఆర్టీసీ అధికారులు అక్కడ బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠశాలలో కళాశాలలో చదువుకుంటున్న బాలికల తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు పిల్లల బాగోగులను తెలుసుకోవడానికి వస్తారు. తదనంతరం బాలికలతో తల్లిదండ్రులు మాట్లాడి వెళ్తుంటారు. ప్రధాన రహదారి పక్కనే పాఠశాల కళాశాల ఉన్నందున బాలికల తల్లిదండ్రులు రోడ్డుపైకి ఎక్కిన తర్వాత ఇటుగా అటుగా బస్సుల కోసం నిల్చుంటారు. కానీ ఏ ఒక్క బస్సు కూడా అక్కడ ఆపిన దాఖలాలు లేవని బాలికల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రయాణికులు అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని మహిళా ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.