Take a fresh look at your lifestyle.

అభివృద్ధి పథకంలో దూసుకెళ్తున్న ఏ ఆర్ పి క్యాంపు….

0

అభివృద్ధి పథకంలో దూసుకెళ్తున్న ఏ ఆర్ పి క్యాంపు

– ఏ ఆర్ పి క్యాంపు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురమల్ల వినోద్ కుమార్ కృషి

ఎడపల్లి, జనవరి 11( లోకంతీరు ) : ఎడపల్లి మండలం ఏ ఆర్ పి క్యాంపు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సర్పంచ్ పురమల్ల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మొట్టమొదట కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామ ప్రజల మౌలిక సదుపాయాల మెరుగుదలే ప్రధాన లక్ష్యంగా పలు పనులు చేపట్టారు.గ్రామంలోని డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా క్లియర్ చేసి పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరిచారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా కొత్త బోర్ ఏర్పాటు చేయడంజరిగింది.

వైకుంఠధామంలో వాటర్ ట్యాంకు పైపు లైన్ పనులు పూర్తి చేశారు.అలాగే గ్రామంలోని అన్ని వార్డుల్లో పైపు లైన్ లికేజీలను గుర్తించి మరమ్మతులు చేపట్టారు. దీంతో నీటి వృథా తగ్గి, సరఫరా సక్రమంగా కొనసాగుతోంది.గ్రామం లో ఎస్సీ కాలనీలో విధి దీపాలు పెట్టాలంటే ఎల్ సిఇచ్చే వారు కాదు. దీనికి పరిష్కారం గా ఏబిస్విచ్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలోని అన్ని గల్లీల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో రాత్రి వేళ భద్రత మరింత పెరిగింది. ఈ అభివృద్ధి పనులపై గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, సర్పంచ్ పురమల్ల వినోద్ కుమార్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.