సెక్యూరిటీ గార్డ్ మృతి
ఎడపల్లి , ఫిబ్రవరి 13 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా రెంజల్ గ్రామానికి చెందిన గాండ్ల సతీష్ (30) , ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. సతీష్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు.గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన సతీష్, జనకంపేట్ కెనాల్ వద్దకు చేరుకున్న సమయంలో ప్రమాదవశాత్తు బైక్‌తో సహా కాలువలో పడిపోయాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సతీష్‌ను బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికు తరలించగా, అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సతీష్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు”
