Take a fresh look at your lifestyle.

అనధికారికంగా వ్యవహరిస్తున్న పోచంపాడ్ ఎంఎచ్ఓ సింగం వినయ్……

0

అనధికారికంగా వ్యవహరిస్తున్న పోచంపాడ్ ఎంఎచ్ఓ సింగం వినయ్ 

– గత రెండు నెలలుగా గైర్హాజరు

– బుదవారం విధులకు హాజరునట్టు ఎంఎచ్ఓ సంతకం, గురువారం మళ్ళీ గైర్హాజరు అయినట్లు మెడికల్ ఆఫీసర్ / డీడీఓ మద్దుల రాకేష్ వెల్లడి…

నిజామాబాద్ / పోచంపాడ్ ,జులై 09 ( లోకంతీరు న్యూస్  ) : అంతా అతని ఇష్టమే రావాలంటే విధులకు వస్తారు, లేకుంటే రారు. ఏ ఒక్క చోట కుడా పూర్తిగా విధులు నిర్వహించిన దాఖలాలు లేవు, ఇదంతా ఎవరో కాదు నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ లో మండల ఆరోగ్య అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎం ఎచ్ ఓ సింగం వినయ్ కుమార్ అధికారి. వివరాల్లోకి వెళితే పోచంపాడ్ ఎం ఎచ్ ఓ సింగం వినయ్ కుమార్  గత రెండు నెలలుగా సక్రమంగా విధులకు రావడం లేదని , వేతనం కూడా ఇవ్వడం లేదని పోచంపాడ్ మెడికల్ ఆఫీసర్ / డీడీఓ మద్దుల రాకేష్ తెలిపారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆసుపత్రికి రావడం లేదు అని ఈ విషయం పై అధికారులు కూడా తెలుపడం జరిగిందన్నారు. నిన్న ఒక్కరోజు మాత్రమే వచ్చి రిజిస్టర్ సంతకంలో  జాయిన్ అవుతున్నట్లు సంతకం పెట్టి మధ్యలో వెళ్లిపోయారని,  గురువారం మొత్తానికే రాలేదని అన్నారు .ఇట్టి విషయం ఉన్నత అధికారులకు తెలుపడం జరిగిందని మెడికల్ ఆఫీసర్ మద్దుల రాకేష్  అన్నారు. ఈ విషయంపై డిప్యూటీ డీఎంహెచ్వో  రవీందర్ ను ఫోన్ ద్వారా వివరణ కోరగా అతను అనధికారికంగా గత రెండు నెలలుగా విధులకు రావటం లేదని అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.