Take a fresh look at your lifestyle.

పి.సి.సి ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యేకు  లేదు….

0

పి.సి.సి ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యేకు  లేదు

నిజామాబాద్ అర్బన్, నవంబర్ 30 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర పి సిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను విమర్శించే నైతిక హక్కు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్ టి సెల్ నగర అధ్యక్షుడు సుభాష్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పదేళ్ల అధికారంలో వున్న టిఆర్ఎస్ పాలనలో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి గా వున్న జిల్లా కు ఒరేగబెట్టిందేమి లేదన్నారు. కేవలం బాల్కొండ నియోజకవర్గంకే పరిమితమాయ్యారని అయన విమర్శించారు. టి ఆర్ఎస్ పాలనలో జిల్లాను పూర్తిగా బ్రష్టు పట్టించారని పేర్కొంటూ మచ్చలేని మహేష్ కుమార్ గౌడ్ ను విమర్శించడం పట్ల జిల్లా ప్రజలు ప్రశాంత్ రెడ్డి తీరు పై అసహించుకుంటున్నారని సుభాష్ జాదవ్ తెలిపారు. ఇప్పటికైన కాంగ్రెస్ పార్టీ పైన లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు మాట్లాడితే సాహించేది లేదని ఖబర్దార్ అని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగంబర, అబ్దుల్, పంచశీల బుద్ధ వ్యవహారం ట్రస్ట్ అధ్యక్షుడు మారుతి లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.