మిట్ట మధ్యాహ్నంమే రెండు ఇండ్లలో చోరీ..!
ఎస్ ఐ ఆర్ నింపేలోపే….



నిర్మల్ / భైంసా క్రైమ్ , జులై 15 ( లోకంతీరు న్యూస్ ) : ఎస్ ఐ ఆర్ ఫార్మ్ నింపి వచ్చే లోపే బైంసా పట్టణంలోని ఓ ఇంట్లో మధ్యాహ్నమే దొంగలు చోరబడి,దోచేసిన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది.బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం వివరాల్లోకెళ్తే… నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని స్థానిక జిపి లడ్డ కాలేజీ ప్రాంగణంలో గల పాలేవార్ దత్తాత్రి ఇంట్లో బుధవారం మధ్యాహ్నం పట్ట పగలే దొంగతనం చోటుచేసుకుందని,ఇంటి యజమాని దత్తాత్రి ఎస్ ఐ ఆర్ పామ్ నింపే క్రమంలో భైంసా కి సమీపంలో ఉన్న తానూరు మండలం ఎల్వి గ్రామానికి వెళ్ళి తిరిగి వచ్చే లోగా ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఇంట్లో 28 వేల రూపాయల నగదు, దాదాపు 10 తులాల వెండి పోయినట్లు పేర్కొన్నారు. మరోపక్క అదే బిల్డింగ్ రెండో అంతస్తులో గల తోలాజి రాకేష్ ఇంట్లో సైతం దొంగలు చొరబడి కొంత నగదు చోరీ చేసిన్నట్టు ఆ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.ఘటన స్థలoలో స్థానిక ఏఎస్పీ సాయి కిరణ్, సీఐ సాయి కుమార్ క్యూస్ టీం ద్వారా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.