Take a fresh look at your lifestyle.

హర్ ఘర్ తిరంగా……..

0

హర్ ఘర్ తిరంగా..

– నగరంలో జాతీయ పతాకాల పంపిణీ…

నిజామాబాద్  , ఆగష్టు 12 ( లోకంతీరు న్యూస్ ) : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు త్రివర్ణ పతాకాలను తమ ఇంటిపై ఆవిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని గాంధీ చౌక్ లో బుధవారం త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత స్వాతంత్రానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాతీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 2022లో హారిక తిరంగా ప్రారంభించారన్నారు. ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసి ప్రజల్లో దేశభక్తి జాతీయ జెండాపై వ్యక్తిగత అనుబంధాన్ని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. 2022 ఆగస్టు 3న అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకు హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ని నిర్వహించాలని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాగోల్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, ఎర్రం సుధీర్, బంటు రాము, బంటు ప్రీతి, శ్యామల, మల్కాయి మహేందర్, సునీత రాజు, బొబ్బిలి సువర్ణ వేణు, వైష్ణవి సుధా, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, జ్యోతి మురళి, మోర్చాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.