లోకంతీరు వార్తా కథనానికి స్పందించిన అధికారులు

నిజామాబాద్, జులై 01 ( లోకంతీరు న్యూస్ ) : జూన్ నెల ఇరవై ఏడవ తేదీన ప్రభుత్వ అనుమతులు లేని ప్రయివేటు ఆసుపత్రుల అనే కథనానికి జిల్లా వైద్య శాఖ అధికారులు స్పందించారు.జిల్లా శాఖ ఆదేశాల మేరకు కమ్మర్పల్లి మండల కేంద్రంలో గల ప్రవేటు ఆసుపత్రికి అధికారులు తనిఖీలు నిర్వహిచి మూసివేశారు.గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రయివేటు ఆసుపత్రికి మూసివేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ ఆసుపత్రులకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ప్రస్తుతం మూసివేయాలని ,అలాగే పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకున్న తర్వాత ఆసుపత్రిని కొనసాగించాలని యజమానులును ఆదేశించినట్లు సమాచారం. జిల్లాలో ఎక్కడైనా ప్రవేటు ఆసుపత్రులు పూర్తిగా అనుమతులు తీసుకున్న తర్వాతనే ఆసుపత్రులను నిర్వహణ చేపట్టాలని జిల్లా వైద్య శాఖ అధికారి రాజ శ్రీ తెలిపారు.