శ్రీ వీరభద్ర గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం
ఎడపల్లి , సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో గత ఐదు రోజుల నుండి వినాయక మండపాల వద్ద మండపాల నిర్వాహకులతో పాటు భక్తులు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వినాయకుని నమ్ముకున్న భక్తులు, దంపతులు ,కుటుంబ సమేతంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్ర గణేష్ ఆలయం వద్ద ఎడపల్లి గ్రామానికి చెందిన కల సాయి దంపతులు దాతగా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేస్తే సకల సౌకర్యాలు, భోగభాగ్యాలు కుటుంబ సభ్యులందరీ పై వినాయకుని ఆశీస్సులు ఉంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.ఏదేమైనప్పటికీ నేటి యువకులుఅన్నదానంచేయడంలో ముందుకు రావడం పట్ల గ్రామస్తులు అభినందిస్తున్నారు. అలాగే ఎడపల్లి పెద్ద చెరువు కట్ట పైన ఉన్న బొర్రగణేష్ మందిరం వద్ద ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారుఎడపల్లి గ్రామానికి చెందిన పెద్దలు, మహిళలు యువకులు, వివిధ శాఖల ఉద్యోగులు, చిన్నారులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.