SIR విజయమే లక్ష్యం ప్రతి సామాజిక కార్యకర్త ముందుకు రావాలి….
– ప్రతి ఓటరూ పేరు జాబితాలో ఉండేలా అధికారులు చొరవ చూపాలి
– BJP నేత తెలంగాణ BC SC ST మైనార్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు , BC సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్

నిజామాబాద్ / ఆర్మూర్ , జులై, ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని పెర్కిట్ గ్రామంలో నేడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, తెలంగాణ BC, SC, ST మైనార్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, BC సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ Special Intensive Revision (SIR) కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొన్న ఆయన, భారత ఎన్నికల సంఘం చేపడుతున్న SIR కార్యక్రమం ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ఉద్దేశించబడిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకొని, అవసరమైతే సంబంధిత పత్రాలను సమర్పించి నమోదు (Enrolment) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.SIR పై ప్రజల్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా ప్రతి సామాజిక కార్యకర్త ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని బుస్సాపూర్ శంకర్ సూచించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో BC సాధికారత సంఘం జిల్లా కార్య నిర్వాహక అధ్యక్షులు చంద్రకాంత్ గౌడ్, తెలంగాణ BC, SC, ST మైనార్టీ సంక్షేమ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు నవీన్ , లిక్కి కుమార్ , రామ కృష్ణ , కిషోర్ , వినోద్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.