జెడ్పిహెచ్ఎస్ కోటగిరిలో గోల్డెన్ జూబ్లీ స్టూడెంట్స్ ఆలుమ్ని వేడుకలు.
- కిడ్స్-2 సభ్యుల ఆధ్వర్యంలో సందడిగా నిర్వహణ.
- పూర్వపు ప్రధానోపాధ్యాయు లను ఘనంగా సత్కరించిన పూర్వ విద్యార్థులు.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 11 ( లోకంతీరు ) :-1974 నుండి 2000 వరకు గల 26 సం.ల పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఒకే పాఠశాలలో చదువుకొని ఒకే వేది కపై కలుసుకొని పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా పాల్గొన్న అద్భుత సన్నివేశం కోటగిరి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. కోటగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెం ట్ సొసై టీ-2 ఆధ్వర్యంలో జడ్పిహెచ్ఎస్ కోటగిరిలో గోల్డెన్ జూబ్లీ స్టూడెంట్స్ ఆలుమ్ని వేడుకలు సందడిగా జరిగాయి.ఈ సందర్భంగా 1974-2000 సం.లకు చెందిన పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు వారివారి బ్యాచ్ సమయంలోని అప్పటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో వారి పాత జ్ఞాపకాలను నెమర వేసుకుంటు గురువులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కిడ్స్ నిర్వాహకులు,పాఠశాల సిబ్బంది పూర్వపు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను ఈ సమ్మేళనంలో ఘనంగా సత్కరించారు.ఈ స్వర్ణోత్సవ వేడుకలలో పూర్వ విద్యార్థులు చాలా ఏళ్ల తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు.ఏం చేస్తున్నారని.వాళ్ళ కుటుంబ నేపథ్యం,వారివారి ఉద్యోగాలు, వ్యాపారాలు మొదలైన విషయాలపై పూర్వ విద్యార్థు లు తమ వివరాలను అనుభవాలను పంచుకున్నారు.తామంతా ఇక్కడికి రావడం అప్పుడు చదువుకున్న స్నేహితులతో కలిసి తమ అనుభవాలను అభిప్రాయాలను వెల్లడించడం ఆనందంగా ఉందని అందుకు ముఖ్య కారకులైన కిడ్స్ సొసైటీ నిర్వాహక బృందానికి వారు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తు సంతోషాన్ని వ్యక్తం చేశారు.అనంతరం పూర్వ విద్యార్థులంతా కలిసి సహపంక్తి భోజనం చేసి ఆనందాన్ని పంచుకున్నారు. తదనంతరం పాఠశాలలోనీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు పూర్వ విద్యార్థులకు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో 1974- 2000,26 సంవత్సరాలలో బోధించిన ప్రధానోపాధ్యాయు లు,ఉపాధ్యాయులు,పదో తరగతి బ్యాచ్ సభ్యులు,కిడ్స్ సొసైటీ సభ్యులు,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. .