మైనారిటీ పాఠశాల విద్యార్థినిలు క్షేత్ర పర్యటన

బాల్కొండ, ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : బాల్కొండ మండల కేంద్రం లో గల మైనారిటీ పాఠశాల విద్యార్థినిలు సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు క్షేత్ర పర్యటన చేశారు ఈ సందర్భంగా తపాలా శాఖ పోలీస్ స్టేషన్ తాసిల్దార్ కార్యాలయం ఎంపీడీవో కార్యాలయం అగ్నిమాపక కేంద్రం చూపించడం జరిగింది. కార్యాలయ అధికారులు విద్యార్థులకు ఉపాధ్యాయులకు గౌరవించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు ఇచ్చారు విద్యార్థులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అధికారుల నుండి మంచి స్పందన రావడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు వాని తెలిపారు పర్యటనకు సహకరించిన అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.