Take a fresh look at your lifestyle.

వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ఏ ఈ ఓ….

0

వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ఏ ఈ ఓ

కామారెడ్డి జిల్లా , ఆగస్టు 17 ( లోకంతీరు ) : రాజంపేట మండలం పెద్దాయిపల్లి గ్రామంలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రీకాంత్ శనివారం పరిశీలించారు. ఎక్కువ గాలి వేగంతో కురిసిన వర్షానికి మొక్కజొన్న వేర్లు బయటకు వచ్చి పడిపోవడం జరిగిందని, రైతులకు తెలియజేశారు. నీరు ఎక్కువగా ఉన్నచోట కాలువలు ఏర్పాటు చేసుకొని, పంటలు నీటి ప్రవాహం నుండి కాపాడుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బోయినీ నర్సింలు, నవీన్ కుమార్, ప్రశాంత్ కుమార్, డీలర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.