ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పడకేసిన వైద్యం
— విష జ్వరంతో మృతి చెందిన చిలుక నరేష్

కామారెడ్డి ప్రతి నిధి , ఆగస్టు 25 (లోకంతీరు) : ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల అలసత్వం వల్ల సదాశివ నగర్ మండలంలోని గ్రామాల్లో విష జ్వరాలు సోకి వేలాదిమంది ఆసుపత్రి పాలై తీవ్ర అవస్థలు ఎదుర్కొంటుండగా గత 15 రోజుల్లో ముగ్గురు మృతి చెందారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు గత ప్రభుత్వంలో జూన్‌లోనే పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామాల్లో మురికి కాలువలు శుభ్రం చేయడం పిచ్చి మొక్కలకు మందులు కొట్టడం వల్ల దోమల నివారణ చేశారు కానీ ఈ ఏడాది అలాంటి పనులు గ్రామపంచాయతీలో నిర్వహించకపోవడం గ్రామాల్లో విష జ్వరాలను సోకి ప్రజల అవస్థలు పడుతూ ఉండడం వల్ల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు మండలంలోని బొంపల్లి గ్రామంలో గత 15 రోజుల్లో ఇద్దరు విద్యార్థులు వృత్తి చెందారంటే గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అలాగే మండల కేంద్రంలో ఆదివారం చిలుక నరేష్ అనే యువకుడు డెంగ్యూ బారిన పడి మృతి చెందడం ప్రభుత్వ పనితీరుకు అడ్డం పడుతుంది అంతేకాకుండా మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో కూడా విష జ్వరాలు జోరందుకున్నాయి మండలంలో ఏ గ్రామానికి వెళ్ళిన ప్రజలు అనారోగ్యం తో విష జ్వరాల బారినపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక్క బొంపల్లి గ్రామంలోని 600 మంది విష జ్వరాల బారిన పడ్డారు ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం శ్రద్ధ వహించి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల అలసత్వం వల్ల మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సదాశివ నగర్ మండలం మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు మండల బీసీ నాయకుడు సాయ గౌడ్ గిరిజన నాయకుడు లింబాద్రి నాయక్ డిమాండ్ చేస్తున్నారు.