సరిగా పనిచేయని బి ఎల్ ఓ లు

ఎడపల్లి, నవంబర్ 23( లోకంతీరు) : ఎడపల్లి మండలంలో అన్ని గ్రామాలలో సరిగా పనిచేయునటువంటి అంగన్వాడి టీచర్లు. అని ఎడపల్లి మండల గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. గత సంవత్సరం ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా. సరిగా సర్వే చేయలేకపోయారు. ఇంటి నెంబర్ ఒకటి ఉంటే. వేర్ చోటు ఓటు హక్కు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ప్రతి ఇంటింటికి తిరగాల్సిన వారు చేతులు దులుపుకుంటున్నారు.కుటుంబ సర్వే ఎలాగో నిర్వహించారో అలాగే ప్రతి ఇంటికెళ్లి ఎంతమంది ఓటు హక్కు కలిగిన వారు ఉన్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఏ కాలనీలో ఉంది. ఏమైనా జంప్ అయినాయా వాటి గురించి తెలుసుకోకుండానే సర్వే పూర్తి చేస్తున్నారు. ఉన్నత అధికారులు ఎంత చెప్పినా ఇటు వినడం అటు వదిలేయడం జరుగుతుంది. అని ఎడపల్లి మండల గ్రామస్తులు తెలిపారు. . 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎడపల్లి తహసిల్దార్ ధన్వల్ కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయం పక్కన గల. భవిత భవనంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో బి ఎల్ ఓ ఎల్ గా విధుల్లో ఉన్న సిబ్బందితోఆయన మాట్లాడారు. అంతకు ముందుగా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఇప్పటివరకు ఎంతమంది ఓటర్ నమోదు అయ్యారని, బిఎల్ఓ లను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫామ్ ఏడు, ఫామ్ ఎనిమిదిలో చేర్పులు మార్పులు,, చనిపోయిన వ్యక్తుల వారి పేర్లు తొలగింపు చేయాలని ఆయన తెలిపారు. ఇతర గ్రామాలలో నివాసముంటున్న వారి ని గుర్తించి, ఒకే వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండే విధంగా బిఎల్వోలు సమగ్ర ఓటర్ సర్వేను, వారి వివరాలను పూర్తిస్థాయిలో సంబంధిత అధికారులకు నివేదికలను అందజేయాలని ఆయన అన్నారు. ఎడపల్లిలోని భవిత భవనంలో బి ఎల్ ఓ లుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరు పట్ల ఆయన హ సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నూతన ఓటరుగా నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న బి ఎల్ ఓ లు, ఓటర్ గా నమోదు చేసుకోవడానికి వచ్చిన వారికి వారి వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించాలని ఆయన సూచించారు.. అలాగే మండలంలోని ఆయా గ్రామాలలోగల 18 సంవత్సరాల నుండి యువకుల ఓటు హక్కు కోసం ఓటరుగా నమోదు చేయించుకోవడానికి ముందస్తు సమాచారం ఇవ్వాలంటే గ్రామాలలో తప్పకుండా చాటింపు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కార్యదర్శులను విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బిఎల్వోలు శారద(దుబ్బ తండా ), ఏకే తులసి,గంగామణి(ఎడపల్లి) తదితరులు ఉన్నారు.