Take a fresh look at your lifestyle.

సీఐ ని సన్మానించిన బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు….

0

సీఐ ని సన్మానించిన బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, నవంబర్ 23 ( లోకంతీరు ) : భీమ్‌గల్ పట్టణ కేంద్రంలోని శనివారం బీఆర్ఎస్ పార్టీ టౌన్, మండలం యువ నాయకులు భీమ్‌గల్ సిఐ నవీన్ కుమార్ ని సన్మానించారు. బదిలీ పై మెట్ పల్లి పట్టణం నుండి భీమ్‌గల్ కు వచ్చిన సందర్భంగా సీఐ నవీన్ కుమార్ ని బీఆర్ఎస్ పార్టీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ నీలం రవి, మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల బాల భగత్, మండల్ యూత్ ప్రెసిడెంట్ రామచందర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ జాన్ సీన్, సోషల్ మీడియా ఫాలోవర్ సునీల్ నారాయణ, యువకులు కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ నవీన్ కుమార్ యూత్ యువకులతో మాట్లాడుతూ చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా మీ వంతు సహకారాన్ని పోలీసులకు అందించాలని సీఐ వారిని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ యువకులు కార్తీక్, రతన్, శ్రీను, చరణ్, అఖిల్, బిట్టు,రాగుట్ల హరీష్, పింకు, అక్షయ యూత్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.