ఫైర్ స్టేషన్ వారు నిర్వహించిన పోటీలలో కాకతీయ ఒలంపియాడు విద్యార్థుల ప్రతిభ

నిజామాబాద్, ఏప్రిల్ 20 ( లోకంతీరు ) : నిజామాబాద్ ఫైర్ స్టేషన్ వారు నిర్వహించిన వ్యాస -రచన పోటీలు మరియు డ్రాయింగ్ పోటీలలో పాల్గొన్న కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల, సుభాష్‌నగర్ బ్రాంచ్ విద్యార్థులు ఆయా విభాగాలలో విజేతలుగా నిలిచారు. వ్యాసరచన పోటీలలో పాఠశాలకు చెందిన లక్ష్మీమేఘన (9వ తరగతి), డ్రాయింగ్ పోటీలలో వైభవి (1వతరగతి) విజేతలుగా నిలిచి నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ సాయి చైతన్య IPS గారి చేతులమీదుగా మెమొంటో అందుకున్నారు. విజేతలను అభినందిస్తూ పాఠశాల డైరెక్టర్ శ్రీరామోజీరావు గారు విద్యార్థులకు చదువుతో పాటూ కో-కరికులర్ ఆక్టివిటీస్ మీద కూడా శ్రద్ధ పెంచుకొని ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ దిగంబర్, మరియు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.