అర్హత గల రికార్డ్ అసిస్టెంట్లకు, జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇప్పిస్తానని హామీ……
నిజామాబాద్, జులై 05 ( లోకంతీరు ) : గత కొన్ని సంవత్సరాల నుండి రికార్డు అసిస్టెంట్లకు ప్రమోషన్ లేకపోవడం వలన చాలామంది రికార్డ్ అసిస్టెంట్ గానే రిటైర్డ్ అయ్యారని, సర్వీసులో చాలా నష్టపోతున్నామని, మా బాధను అర్థం చేసుకోండని జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారికి శనివారం రోజున విన్నవించడం జరిగింది. మా విన్నపాన్ని సహృదయంతో, సానుకూలంగా అర్థం చేసుకొని అర్హత గల రికార్డ్ అసిస్టెంట్లకు, జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎండి సైఫ్ అలీ, ప్రధాన కార్యదర్శి జి గోపి మరియు కోశాధికారి కన్నడ శ్రీనివాస్ పాల్గొనడం జరిగినది.