Take a fresh look at your lifestyle.

ఏక కాలంలో పట్టుబడ్డ కార్మిక శాఖ అధికారులు….

0

మంచిర్యాల జిల్లాలో ఎ.సి.బి దాడులు

ఏక కాలంలో పట్టుబడ్డ ఇద్దరు అధికారులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ , జూలై 18 ( లోకంతీరు) : మంచిర్యాల జిల్లాలో శుక్రవారం జరిపిన ఎ.సి.బి దాడుల్లో ఏక కాలంలో పట్టుబడ్డ ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు ఒకేసారి రెండు చోట్ల నిర్వహించిన దాడుల్లో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడడం కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్మిక శాఖ అధికారి రామ్మోహన్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. అదే రోజున బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్యను ఓ మహిళ వద్ద నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే, బెల్లంపల్లికి చెందిన నరాల శంకర్ అనే బిల్డింగ్ వర్కర్ గత సంవత్సరం మృతి చెందగా, అతనికి ఉన్న లేబర్ కార్డు ద్వారా ఇన్సూరెన్స్ డబ్బులు పొందేందుకు భార్య మీసేవలో దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు బెల్లంపల్లి లేబర్ ఆఫీసులో సహాయం కోరగా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్య రూ.40 వేలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఏసీబీకి ఫిర్యాదు చేసింది. తరువాత బెల్లంపల్లి పబ్లిక్ గార్డెన్ వద్ద ఆ మహిళ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ సిబ్బంది సుకన్యను పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ ఈ వివరాలను తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.