గల్ప్ కార్మికులకు, ఎన్ఆర్ఐ లకు సమస్యలు ఉంటే ప్రవాసి ప్రజావాణిలో వినతి పత్రాలు ఇవ్వవచ్చు
— 150 గల్ఫ్ బాధితులకు 5 లక్షలు చొప్పున ఇచ్చాం.
— గల్ఫ్, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి


నిజామాబాద్ రూరల్, ఆగస్ట్ 01 ( లోకంతీరు) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గల్ఫ్ కార్మికులకు, ఎన్నారైలకు ఎటువంటి సమస్య వచ్చినా, కష్టాలు ఏర్పడ్డ హైదరాబాదులోని ప్రగతి భవన్లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రవాసి ప్రజావాణిలో చెప్పుకోవచ్చు అని గల్ఫ్, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులలోనే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవాసి ప్రజావాణి ఏర్పాటు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవాసి ప్రజావాణి ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ప్రవాసి ప్రజావాణి అడ్వైజరి కమిటీ సభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్ లో శుక్రవారం జరిగిన ప్రవాసి ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని గల్ఫ్ యూకే, ఆస్ట్రేలియా ప్రవాసి కుటుంబాలను కలుసుకొని వారి సమస్యలను అడిగి డాక్టర్ భూపతి రెడ్డి తెలుసుకున్నారు. ఎన్ఆర్ఐ ఎంబాసిలతో మాట్లాడి ఇప్పటివరకు 150 మంది మృతదేహాలను తెప్పించి వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదుకోవడం జరిగిందని అన్నారు. అలాగే గల్ఫ్ నుంచి వచ్చిన మృతదేహాలకు శంషాబాద్ విమానాశ్రయం నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ రవాణా ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఆరు ప్రాంతంలో జరుగుతున్న పాదయాత్రలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు 150 మంది గల్ఫ్ బాధితులను స్వయంగా కల్పిస్తామని అన్నారు.
గల్ఫ్ ఎన్నారై ప్రవాస ప్రజవాని చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి తో గల్ఫ్ బాధితుల గురించి సమావేశమై పలు విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వజరీ కమిటీ వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి, సభ్యులు నంగి దేవేందర్ రెడ్డి, సిస్టర్ లిజీ జోసఫ్,ఎన్నారైలు రంగుల సుధాకర్ గౌడ్, గుండెటి గణేష్, అమరేందర్ బొజ్జ, లక్ష్మణ్ యాదవ్, వలస కార్మికుల హక్కుల నాయకులు బిఎల్ రవీంద్రనాథ్, భార్గవి, ప్రజావాణి నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.