Take a fresh look at your lifestyle.

తెలంగాణ రాష్ట్రంలోని యువకులను, ప్రజలను, మహిళలను, మోసం చేస్తూన్న కాంగ్రెస్ ప్రభుత్వం…..

0

రాజీవ్ యువ వికాసం పేరుతో తెలంగాణ నిరుపేద లక్షలాదిమంది యువకులను మోసం చేసి కొన్ని నెలలుగా ఆశ పెడుతూ ఉసురుమనిపిస్తున్నారు తప్ప ఇప్పటివరకు ఏ ఒక నిరుపేద యువకునికి రాజీవ్ వికాసం రుణం ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్రంలోని యువకులను ప్రజలను మహిళలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపు కుంటుందని
భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్ అన్నారు. మహాలక్ష్మి పథకం పేరు చెప్పి తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులను కూడా మోసం చేసి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి మహిళకు నెలకు ₹2,500 చొప్పున ఇస్తానని చెప్పి మోసం చేశారని , ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుక్కోవడం తప్ప పేద ప్రజలకు చేసేదేమీ లేదు అని రుజువైపోయిందన్నారు.ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకొని ఎడల రాబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది. పేద ప్రజల పక్షాన నిలబడి వారికి రావలసిన సంక్షేమ పథకాలు అందే వరకు ఉద్యమాలు చేస్తామని తెలియజేసారు.

Leave A Reply

Your email address will not be published.