జానకంపేట్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముగిసిన వేలం పాట

ఎడపల్లి , నవంబర్ 29 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆలయ అధికారులు బహిరంగ వేలం పాటను నిర్వహించారు రెండు సంవత్సరాల కాల పరిమితి తో ఆలయం లో లడ్డు పులిహోర నవధాన్యాలు కొబ్బరికాయల విక్రయాలకు సంబంధించి 2.02.500/రూపాయలకు గాను నిజామాబాద్ కు చెందిన సురేష్ అనే వ్యక్తి వేలంపాట ద్వారా దక్కించుకోవడం జరిగిందని ఆలయ కమిటీ ఈవో వేణు తెలిపారు.