Take a fresh look at your lifestyle.

మహనీయుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ……

0

మహనీయుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 

— ఘనంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి 

— నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నిజామాబాద్ రూరల్,, సెప్టెంబర్ 02 ( లోకంతీరు ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా జనహృదయాలు నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి ముఖ్యమంత్రి పేరు తెచ్చుకున్నాడని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ వంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టారని అన్నారు. ఆయన 2004 నుండి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. అలాగే స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీ, బాసర వద్ద ఐఐఐటి, విద్య,ఇరిగేషన్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయని అన్నారు. అట్లాగే నిజామాబాద్ జిల్లాకు నిజాం సాగర్ నుండి గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వచ్చాయని గుర్తు చేశారు. 90 వేల ఎకరాల పంట భూములకు నీరును తీసుకొచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిది అని అన్నారు. మన నిజామాబాద్ జిల్లాకు ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అన్నారు, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినది అన్నారు. రైతుల ప్రభుత్వం రైతులను రాజులు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని, పంట రుణమాఫీ, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డిలికెట్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,డీసీసీ డెలికెట్ ధర్మగౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, నిజాంబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, ఏఎంసీ డైరెక్టర్లు నరేందర్, రాజలింగం, గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రన్న, వాసు బాబు, రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.