వినాయకుల విగ్రహాలను నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం
– బోధన్ బిజెపిపట్టణ అధ్యక్షులు పసులోటి గోపి కిషన్

ఎడపల్లి, సెప్టెంబర్ 20 ( లోకంతీరు ) : బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లి ఆటోనగర్ వద్ద రెండు సం.రాల క్రితం షెడ్డు వేసి అందులో వినాయక విగ్రహాలను తయారుచేసి అమ్మడం జరిగింది , గత సం. నుండి మిగిలిన వినాయకుల విగ్రహాలను అలాగే వదిలేసి వెళ్ళిపోయారు, శనివారంరోజు భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆ ప్రదేశాన్ని సందర్శించి వినాయకుల విగ్రహాలను పరిశీలించడం జరిగింది, అనంతరం బోధన్ సబ్ కలెక్టర్ గారికి ఆ వినాయకుల విగ్రహాలను నిమర్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా బిజెపి బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపీ కిషన్ మాట్లాడుతూ ఆటో నగర్ వద్ద ఏర్పాటు చేసిన షెడ్డులో రెండు సం. రాలుగా మిగిలిపోయి ఉన్న వినాయకుల విగ్రహాలు శిధిలావస్థకు చేరుకుని చాలా దీనస్థితిలో ఉండి, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి అన్నారు, వెంటనే ఆ విగ్రహాలను నిమర్జనం చేసే ఏర్పాట్లు చేయాలని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు,ఈ కార్యక్రమంలో బిజెపి బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శులు అరవింద్, పవన్ కుమార్, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, కందికట్ల వాసు, గాదె సందీప్, గుంత గంగాధర్, బీజేవైఎంపట్టణ అధ్యక్షులు గౌతం గౌడ్,నాయకులు సాగర్ ,విజయ్, అనిల్, లింగం,దీపక్, పడాల శ్రీను, కిరణ్ , కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.