పోచారం గ్రామంలో ఘనంగా ఊర పండగ వేడుకలు
ఎడపల్లి, అక్టోబర్ 05 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో ఆదివారం ఊర పండుగ వేడుకలను పోచారం గ్రామస్తులు శుక్రవారం ప్రారంభమైన పండుగ వేడుకలను ఆదివారంతో ముగిసాయి భక్తిశ్రద్ధల నడుమ భాజ భజంత్రీలతో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు గ్రామంలోని పిల్లా పాపలు పాడి పంటలు చల్లగా ఉండాలని గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ ఊర పండగను నిర్వహించు కుంటామని గ్రామస్తులు తెలిపారు.