Take a fresh look at your lifestyle.

సీనియర్ సిటిజన్ శ్రీరామారావు దేశ్ ముఖ్ గారికి ఘనంగా సన్మానం….

0

సీనియర్ సిటిజన్ శ్రీరామారావు దేశ్ ముఖ్ గారికి ఘనంగా సన్మానం

ఎడపల్లి, అక్టోబర్ 06 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన వయోవృద్ధులు రామారావు దేశముఖ్ ను వయోవృద్ధుల అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.2025 సంవత్సరానికి గాను సీనియర్ సిటిజన్ వెల్ఫేస్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు . జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు నెలలో ఆరుగురు వయో వృద్ధులనుఅసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపిక చేసినట్లు తెలిపారు ఆయన ఎడపల్లిలో లేకపోవడంతో రైతు వేదికలో జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగాఘనంగా ఐదుగురిని సన్మానించి జ్ఞాపకలను అందజేసినట్లు ప్రతినిధులు తెలిపారు. ఇందులో వయో వృద్ధుల్లో రామారావు దేశముక్, అందుబాటులో లేకపోవడంతో, అనివార్య కారణాలవల్ల సన్మాన కార్యక్రమానికి రాలేకపోయ్యారు. సోమవారం ఎడపల్లిలోని ఆయన నివాస ఇంటికి వెళ్లి సన్మానించి జ్ఞాపికను అందజేసినట్లు ప్రతినిధులు తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పోల మల్కారెడ్డి,పేరిక రాజలింగం, కలశంకర్, గంగారెడ్డి, శంకర్ గౌడ్, తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు ఆయన చిన్నప్పటి చేసినటువంటి సేవలను గుర్తించి వారు అభినందించారు పొలం లేని రైతులకు వరి ధాన్యం పంపిణీ చేయడం ఎంతో గర్వకారణం అని వారన్నారు వ్యవసాయ వృత్తులు చేసుకునే వారికి కులమతాలు బేధాలు లేకుండా అందరికీ సమానంగా చూసే మనస్తత్వం గల శ్రీ రామారావు దేశ్ ముఖ్ గారి పేరు చెప్తే ఎడపల్లి మండలంలో ప్రతి ఒకరు అయినను గుర్తించుతారు అని సీనియర్ సిటిజన్స్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.