బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ ఏసీపి శ్రీనివాస్ కు వినతి పత్రం
ఎడపల్లి, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : బోధన్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏసీపి శ్రీనివాస్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది బోధన్ భారతీయ జనతా పార్టీ పట్టణఅధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ ఈనెల 17న నిజామాబాద్ వినాయక నగర్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ పై రియాజ్ అనే ఒక దొంగ రౌడీషీటర్ కత్తితో దాడి చేసి హత్య చేయడం జరిగింది ఆ రౌడీ షీటర్ ని వెంటనే ఎన్కౌంటర్ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే సంఘవిద్రోహశక్తులను చట్ట వ్యతిరేకులను దేశ వ్యతిరేకులను గుర్తించి వారిని జైల్లో వేయాలని పోలీస్ ఉద్యోగి పరిస్థితి ఇలా రక్షణ లేకుండా ఉంటే సామాన్య ప్రజల భద్రతపై ప్రశ్నార్థకం తలెత్తుతుంది కావున పోలీసు అధికారులు నిజామాబాద్ బోధన్ లాంటి సమస్యత్మక ప్రాంతాలలో కాటన్ సర్చ్ నిర్వహించి నిజామాబాద్ జిల్లాలో రౌడీ షీటర్లపై దొంగల పై మరియు చట్ట వ్యతిరేకుల పై ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలని బోధన్ బిజెపి పట్టణ శాఖ డిమాండ్ చేస్తుంది అని వారు చెప్పడం జరిగింది అలాగే ప్రమోద్ గారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వారి పిల్లల విద్యాభ్యాసం ఖర్చులు ప్రభుత్వమే భరించి ప్రమోద్ గారి మృతి పట్ల రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ అధికారులను డిమాండ్ చేస్తుంది అలాగే ఆ యొక్క ఘటనలో గాయపడిన సిసిఎస్ ఎస్ఐ విఠల్ గారిని కూడా వారి స్వగృహంలో పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గోడుకు ధర్మపురి, వినోద్ చిన్న, గుంతగంగాధర్, హనుమాన్లు చారి, ప్రధాన కార్యదర్శులు రాజుల దేవి పవన్ కుమార్, మిర్జాపూర్ అరవింద్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఏశాల సూరి, దళిత మోర్చా అధ్యక్షులు కలిగోట్ కృష్ణ, కార్యదర్శులు నిమ్మ శ్రీను, స్వప్నిల్, దేవకట్ట శివ,కందికట్ల వాసు, పేరుక వెంకటేష్, కస్ప లింగం, అడ్లూరిఫణి, లిస్రోఅనిల్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.