బోధన్ లో మున్సిపల్ కమిషనర్ పర్యటన
ఎడపల్లి, అక్టోబర్ 30 ( లోకంతీరు ) : బోధన్ పట్టణంలో స్ట్రీట్ లైట్లు పనితీరును పరిశీలించేందుకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఏఈ శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బందిచే బుధవారం రాత్రి అనువ్యపర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా 24. 26. 27. 28. 36. వార్డులోని ప్రధాన రహదారులు కాలనీలో వెలుతురు పరిస్థితులను పరిశీలించారు పనిచేయని లైట్లు వైర్ల లోపాలు పాత బల్బులు వంటి సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు రాత్రి వేళలో ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి వీధి సరైన వెల్తురులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు పౌరులు చేసిన ఫిర్యాదులను ప్రాధాన్యంగా తీసుకొని త్వరితగతిన పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు పర్యటనలో మున్సిపల్ సిబ్బంది విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు