Take a fresh look at your lifestyle.

అద్యాత్మిక, సామాజిక కార్యక్రమాలలో అతివలు…..

0

శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ రాష్ట్ర మహిళా విభాగం ఎన్నికలు మరియు కార్యవర్గ ఎన్నిక

నిజామాబాదు, నవంబర్ 04 ( లోకంతీరు ) : భక్తి మార్గాన సేవే లక్ష్యంతో స్థాపించబడిన దేశ వ్యాపంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది మన్ననలు పొందుతూ మహిళలు ఆధ్యాత్మిక సామాజిక సేవలతో తనదైన శైలిలో అయ్యప్ప స్వామి నామస్మరణ తో ముందుకు అడుగులు వేస్తున్న శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ రాష్ట్ర మహిళా విభాగం ఎన్నికలు ఈ ఆదివారం 02/12025 న అన్ లైన్ పద్దతిలో నిర్వహించడం జరిగింది. చైర్మెన్ కళ్యాణ్ చక్రవర్తి, అధ్యక్షులు తేలు శ్రీనివాస్ లు అధ్యక్షతన వహించి రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్ను కోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ గా నిజామాబాద్ కుచెందిన మాదవి లత, వైస్ కో ఆర్డినేటర్ గా హైదరాబాద్ కు చెందిన భవాని, రాజన్న సిరిసిల్ల కు చెందిన మంజుల, కోశాధికారిగా హైద్రాబాదు ప్రసన్న, కార్యదర్శి లుగా నిజామబాద్ సునిత, హైద్రాబాద్ వనిత, వాలంటరీ కమాండెంట్ గా సౌజన్య, నిజామాబాద్ కు చెందిన అన్నపూర్ణకు , నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, జోనల్ ఇంచార్జ్ బాద్యతలు ఇవ్వడం జరిగింది . వీరందరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రానున్న రోజులలో రాష్ట్రవ్యాప్తంగా ట్రస్ట్ ద్వారా నిర్వహించే అద్యాత్మిక, సామాజిక కార్యక్రమాలలో ముందుండి సంస్థ బలోపేతానికి కృషి చేస్తామని మహిళలు ఆధ్యాత్మికతో,అయ్యప్పస్వామి తత్వం తో సేవ చేయడానికి ముందుంటారని రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి మాదవిలత తెలిపారు . ఈ ఎన్నికలలో రాజేందర్, శ్రీనివాస్, అనంద్, మరియు ట్రస్టీలు,కార్యవర్గ సభ్యులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.