లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
ఎడపల్లి, నవంబర్ 04 ( లోకంతీరు ) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి, బోధన్ లయన్స్ కంటి హాస్పిటల్స్ సహకారం తో తానాకాలన్ గ్రామంలో క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ మెర్సీసుమారు75మందికి డయాబెటిక్ క్యాంప్ నిర్వహించి తగు జాగ్రత్తలు సూచనలు చేశారు.క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ కంటి స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైద్యులు అజయ్ సుమారు75 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 10 మందికి మోతె బిందు ఉన్నట్లు వైద్యులు గుర్తించి వారిని ఉచిత కంటి శస్త్ర చికిత్స నిమిత్తం బోధన్ లయన్ హాస్పిటల్ కి పంపించారు కార్యక్రమం లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షురాలు పుష్పలత కార్యదర్శి మెర్స కోశాధికారి శంకర్, జీఈటీ కోఆర్డినేటర్ సూర్యనారాయణ గంగరెడ్డి,నార్ల కాశీనాథ్ గుప్త,ప్రకాష్ , మనోజ్, పిఆర్ఓ రాకేష్వర్మ. గ్రామపంచాయతీ కార్యదర్శి రంజిత్ తధితరులు పాల్గొన్నారు.