Take a fresh look at your lifestyle.

ఎడపల్లి లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం…..

0

ఎడపల్లి లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం

ఎడపల్లి, నవంబర్ 04 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో మంగళవారం మధ్యాహ్నం, సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రైతులు పండించిన వారి ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. ఎడపల్లి, మంగళ్ పహాడ్, కుర్నపల్లి, తానాకలాన్, జానకంపేట, ఆయా గ్రామాలలో రైతులు ఆరబెట్టిన ధాన్యం రాశులు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి.. రేపు మా పో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకుంటామని రైతన్నల ధైర్యం మంగళవారం అనుకోకుండా వర్షం ఒక్కసారిగా కొట్టడంతో ధాన్యం తడిచి పోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వెలుగు, మధ్యాహ్నం ఎండ, సాయంకాలం మబ్బులతో కూడిన భారీవర్షం ఏకాదడిగా కురవడంతో రైతన్నలు అయోమయంలో పడుతున్నారు. పండించిన పంట తమ కంటి ముందుగా నష్ట పోతుండడంతో  రైతులు తీవ్ర ఆవేదన గురవుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మండలంలోని ఆయా గ్రామాల రైతులు సంబంధిత అధికారులను కొనుగోలు నిర్వాహకులను కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.