Take a fresh look at your lifestyle.

నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్…..

0

నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్

– వర్ని మాజీ ఎం ఈ ఓ పై కేసు నమోదు

ఎడపల్లి, నవంబర్ 09 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా వర్నిని మండల కేంద్రానికి చెందిన గజ్జవరపు మీరా వేణి (64) ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎంఈఓ పై కేసు నమోదు చేశారు వివరాలిలా ఉన్నాయి మీరవేణి ఆమె భర్త లోకం సాంబశివరావు మరణం అనంతరం అతనికి చెందిన 9 ఎకరాల 24 గంటల భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించగా ఆ భూములు అప్పటికే మెడుగుల అనిల్ రెడ్డి విజయలక్ష్మి కర్రోల లక్ష్మణ్ తదితరుల పేర్లపై నకిలీ పత్రాలతో రిజిస్టర్ అయినట్లు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు భూమి యజమాని సాంబశివరావు హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో మృతి చెందు తే వర్నిని గ్రామపంచాయతీలో నకిలీ మరణ ధ్రువపత్రం సృష్టించి తప్పుడు రీతిలో భూమిని తమ పేర్లపై రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు గుంటూరు జిల్లాకు చెందిన గోవర్ధన్ రెడ్డి సాంబశివరావు ఈ తొమ్మిది ఎకరాల భూమిని తనకు విక్రయించాడని బోధన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పెద్దలతో చర్చించాలని భావించి ఆలస్యం జరిగిందని కానీ నిందితులు బెదిరింపులు చేసినందున ఫిర్యాదు చేయడం ఆలస్యమైందని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.