స్పెషల్ పాలన ఇంకెన్నాళ్లు..?
. కుంటుపడుతున్న గ్రామ పాలన..?
. స్పెషల్ అధికారుల సమన్వయ లోపమా..?
. బాధ్యత వాయించని సెక్రెటరీ లా..?
. పారిశుద్ధ లోపం ప్రజల ప్రాణాలకు శాపం..?


కామారెడ్డి, నవంబర్ 09 ( లోకంతీరు ) : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ పాలన ముగిసి చాలా రోజులు అవుతుంది. సర్పంచ్ ల పాలన ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం వారి స్థానాలలో స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ప్రస్తుతం స్పెషల్ అధికారులు సెక్రటరీలు యధావిధిగా పని చేయాల్సిన అవసరం బాధ్యతతో కూడుకున్న వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థను సమన్వయ లోపం వలన కొన్ని గ్రామాలలో చాలా రకాల అత్యవసర పనులు, అదేవిధంగా పారిశుద్ధ్యం, మంచినీరు, ప్రస్తుతరణంలో ఇలాంటి పై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.పల్లెల్లో పంచాయతీలు సరిగా పనిచేయక స్పెషల్ పాలన అధికారులు, సెక్రటరీలు సమన్వయంతో కలిసి పని చేస్తే అభివృద్ధి యదా విధంగా కొనసాగుతోంది. కానీ అసలే గ్రామపంచాయతీలకు స్పెషల్ అధికారులను నియమించడం వలన కొంత సమస్య ఏర్పడుతూ గ్రామాలలో కొంత మేర అత్యవసర, నిత్యవసర, పారిశుద్ధ్యం కుంటుపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలం సీజన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సుమారు 70% గ్రామ పంచాయతీలలో ఇదే తతంగం.? గ్రామాలలో సక్రమంగా నిర్వహించలేక
పోవడం వల్ల సీజనల్ వ్యాధులు సోకి ప్రజలు నానా అవస్థలు పడుతున్నరు. పారిశుద్ధ పనులు నిర్వహించవలసిన స్పెషల్ ఆఫీసర్లు గ్రామ కార్యదర్శులు చేతులు ఎత్తేయడం తో ప్రజలు దోమల బారిన పడి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.పలు గ్రామాలలో విష జ్వరాల బారిన పడుతూ చాలా మంది ప్రజలు హాస్పిటల్ ల పాలవుతున్నారు. పనులు చేపించవలసిన పంచాయతీ కార్యదర్శిలు చాలవరకు గ్రామ పంచాయతీలలో నిధులు లేవని చేతులెత్తేస్తున్నారు.చాలా గ్రామాలలో చెత్తను పారవేసె ట్రాక్టర్లు కూడా గ్రామాలలో తిరగడం లేదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవని వారు పనికి రావడం లేదు. అని కొందరు కార్మికులు బాధతో నక్కిపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్టు పత్రికా ప్రకటన చేసిన అమలు కావడం లేదు.? ఆ నిధులు అవి ఎటు చాలడం లేదు, దీనితో మార్మూల గ్రామంలోని ప్రజలు విషజ్వరాల తో వేలాది రూపాయలు దవఖానాలలో ఖర్చు చేసుకుంటున్నారు.గ్రామీణ ప్రాంతాల పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామాలలో వైద్య సదుపాయం కల్పించి,వైద్యం అందించే క్యాంపులు ఏర్పాటుచేసి గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కాపాడాలని, గ్రామాన్ని అభివృద్ధి దృశ్య ముందుకు తీసుకువెళ్లాలని సమన్వయంతో పనిచేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, మేధావి వర్గం యువత భావిస్తుంది.