డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష
ఎడపల్లి, నవంబర్ 13 ( లోకంతీరు ) : బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ లో మద్యం తాగి వాహనం నడుపుతూ ఖానాపూర్ గ్రామానికి చెందిన చిత్తం సాయిలు పట్టు బడ్డారు. అతనిపై కేసు నమోదు చేసి బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరు పరచగా 2000 రూపాయల జరిమానా తో పాటు మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారని పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు.