ఎడపల్లి మండలంలో సర్పంచులు వార్డు సభ్యులు రిజర్వేషన్ ఖరారు

ఎడపల్లి , నవంబర్ 24 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన దృష్ట్యా ఇందులో భాగంగా సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఆదివారం ఖరారు అయ్యాయి ఎడపల్లి మండలంలోని 17 గ్రామ పంచాయతీల రిజర్వేషన్ ప్రక్రియ జాబితాను అధికారులు విడుదల చేశారు. వార్డు సభ్యుల రిజర్వేషన్ ప్రక్రియను సైతం వెల్లడించారు. మండలంలోని అంబ o (వై), నెహ్రు నగర్ గ్రామాలలో (బీసీ. మహిళ) ఏ ఆర్ పి క్యాంప్, బ్రాహ్మణపల్లి, ధర్మారం ఎడపల్లి గ్రామాలకు (జనరల్,), జైతాపూర్, జమలం, కుర్నపల్లి, గ్రామాలకు( బిసి,), మంగల్పహాడ్, ఎం ఎస్ సి ఫారం, పోచారం, తానా కలా న్, జానకంపేట గ్రామాలకు,( జనరల్ మహిళా), బాపూనగర్ (ఎస్సీ మహిళా), దుబ్బ తండా (ఎస్టీ,) వడ్డేపల్లి (ఎస్సీ), అలాగే వార్డుల వారీగా కూడా ఖరారు కావడంతో గ్రామాల్లో సర్పంచుల ఎన్నికల వేడి ప్ర ప్రారంభమై అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మండలంలోని ఎక్కడ చూసినా నాయకులుఎన్నికలలో గెలుపు అభ్యర్థుల కోసం వేట ప్రారంభించినట్లు సమాచారం.త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎడపల్లి మండలంలో రాజకీయం మరింత వేడెక్కనుంది.