బోధన్ పట్టణంలో ఆపన్నులకు చేయూత సాయం

ఎడపల్లి , నవంబర్ 30 ( లోకంతీరు ) : బోధన్ పట్టణంలో యాచకులు బీదవారు రోడ్డు వెంట దుకాణాల ముందు ఇల్లు లేక చలితో వణుకుతూ నిద్రిస్తున్న వారికి ఆదివారం రాత్రి చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు దుప్పట్ల తో పాటు పేదలకు భోజన ప్యాకెట్లను అందించారు ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ వెంకట్ నారాయణ ఎస్సై భాస్కర్ చారి చేయూత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జాదవ్ ప్రవీణ్ నాయక్ ఉప్పరి శ్రీకాంత్ మంగలి భూమన్న కుర్ర బంతి లాల్ నాయక్ వినోద్ కుమార్ సాయి తదితరులు పాల్గొన్నారు