అహర్నిశలు అలుపెరుగని ప్రజా నాయకురాలు వీణ
-
సర్పంచ్ అభ్యర్థి చేపూర్ వీణ శ్రీనివాస్ గౌడ్
-
కత్తెర గుర్తు కు ఓటు వేయండి


ఎడపల్లి , డిసెంబర్ 07 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీణ శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది. కావున ప్రజలందరూ యువ నాయకురాలిని ఆశీర్వదించి పెద్ద మనసుతో దీవించి సర్పంచ్ గా మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గ్రామాభివృద్ధికి కృషి చేయడానికి ముందుకు వచ్చిన వీణ శ్రీనివాస్ గౌడ్ ని అధిక మెజార్టీతో గెలిపించలని, అభివృద్ధికి అహర్నిశలు తోడ్పడే విధంగా కృషి చేసేందుకు శాయశక్తుల, కృషి చేసేందుకు తన వంతు బాధ్యతగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రచారాన్ని ముమ్మరంగా ప్రజలకు తమ గుర్తులు తెలియజేసేందుకు భారీ ఎత్తున ర్యాలీగా ఇంటింటికి ప్రచారాన్ని కొనసాగిస్తూ అభివృద్ధికి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ అక్క చెల్లెలు అన్న తమ్ముళ్లు అనే తేడా లేకుండా ముఖ్యంగా కులమతాలకు అతీతంగా గ్రామాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో గ్రామాభివృద్ధికి తోడ్పడతానని ప్రచారంలో తెలపడం జరిగింది. అదేవిధంగా గ్రామ సమస్యలకు హెల్ప్ లైన్, ప్రతి వార్డులో ఫిర్యాదు బాక్స్ తో పాటు ప్రతి 15 రోజులకు ఒకసారి వాటిని పరిశీలించడం సమస్యను తక్షణమే అక్కడికక్కడే పరిశీలించే దిశగా సర్వత్ర కృషి చేస్తానని, అధికారం కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం ముందుకొచ్చిన యువకు రాలిగాగా హక్కున చేర్చుకొని ఆదరించి మీ అమూల్యమైన ఓటు కత్తెరగుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కోరారు.